
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎమ్మెల్యేలపై విచారణలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మరో షెడ్యూల్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో మిగిలిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 19న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, 20న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాన్రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ను ఎదుర్కోనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు