
పుట్టపర్తి, 18 నవంబర్ (హి.స.)పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి పట్టణం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్ , అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ తదితరులు కూడా నేటి వేడుకలకు హాజరుకానున్నట్లు సమాచారం. ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు విస్తృతమైన భద్రతా చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV