
పుట్టపర్తి, 18 నవంబర్ (హి.స.)
నేటి నుంచి పుట్టపర్తిలో (Puttaparthi) శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల కోసం పుట్టపర్తి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది.
ప్రముఖుల రాకపోకలతో ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) పుట్టపర్తికి చేరుకున్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు (AP Ministers) సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
వారంతా సత్యసాయిబాబా సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అనంతరం బాబా ఊరేగింపులో పాల్గొన్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV