
అమరావతి, 19 నవంబర్ (హి.స.)ఓ వైపు చలి.. మరో వైపు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే.. తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి చంపేస్తుండగా.. మరో వైపు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు భయపెడుతున్నాయి.. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.. దీంతో రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV