
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
సినిమాలను పైరసీ చేస్తూ.. ఇండస్ట్రీని బెంబేలెత్తించిన ఐబొమ్మ నిర్వాహకులు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇకనైనా పైరసీ ఆగుతుందా? సైబర్ క్రైమ్ కు చెక్ పడుతుందా? అని తలెత్తుతున్న సందేహాలపై రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఒకడు పోతే మరొకడు వస్తాడని, వాడు కూడా మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడని పేర్కొన్నారు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్ ను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయని తెలిపారు. వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటేనని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు