
Andhra Pradesh, 19 నవంబర్ (హి.స.) పవన్. క్రికెటర్ సచిన్, సినీ నటి ఐశ్యర్యారాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. ఆ తర్వాత సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని తిలకించారు.
అటు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యరాయ్.. సత్యసాయి సేవా తత్వాన్ని గుర్తు చేసుకున్నారు. మానవసేవే మాధవ సేవ అని సత్యసాయి చెప్పారని ఐశ్వర్యరాయ్ గుర్తు చేసుకున్నారు. చదువే మనిషిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. బాల వికాస్ పేరుతో ఎన్నో వేలమంది పిల్లలను చదివిస్తున్నారు. లక్షల మందికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. సత్యసాయి ఆర్గనైజేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని ఐశ్వర్యరాయ్ ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV