
నల్గొండ, 19 నవంబర్ (హి.స.) నియోజకవర్గంలో రోడ్డు సదుపాయం, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు వచ్చే ఏడాదికల్లా పూర్తి చేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం నియోజకవర్గ పర్యటనలో వారు మాట్లాడుతూ.. పేర్వాల గ్రామానికి చేరుకునే రహదారి పై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ ని నిర్మిస్తామని తెలిపారు. నేరెడుగొమ్ము నుండి పేర్వాల వరకు కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల పై గ్రామప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను ఎమ్మెల్యే శ్రద్ధగా విని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంత అభ్యున్నతి, ఆధ్యాత్మిక ప్రాచుర్యానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు