ఈడీ దాడుల ఎఫెక్ట్.. పలువురు ప్రొఫెసర్లు.. స్థానికులు అదృశ్యం.. రంగంలోకి హర్యానా డీజీపీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 19 నవంబర్ (హి
ED Raids Al-Falah University Across 25 Locations in Money Laundering Probe


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 19 నవంబర్ (హి.స.)

అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా చాలా పెద్ద కుట్ర జరిగినట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తు సంస్థలు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్ర మూలాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడ్డాయి. కీలక ఉగ్రవాదులు ఉమర్, షాహీన్, ముజమ్మిల్ ముగ్గురు కూడా విశ్వవిద్యాలయం కేంద్రంగానే దేశ వ్యాప్త దాడులకు ప్రణాళికలు రచించారు. ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందంటే.. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోంది. ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే జరిగిన కుట్రలో అంతర్గతంగా వాళ్లు పాత్ర ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు పెద్ద ఎత్తున క్యాంపస్‌లో దాడులు చేశారు. జామియానగర్‌లో సంస్థ చైర్మన్ ఇంట్లో సహా మొత్తం 25 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈడీ దాడుల నేపథ్యంలో క్యాంపస్‌లో ఉండాల్సిన చాలా మంది ప్రొఫెసర్లు ఇప్పుడు అదృశ్యమైనట్లుగా అధికారులు గుర్తించారు. అంతమాత్రమే కాకుండా క్యాంపస్‌కు సమీపంలో ఉండే చాలా మంది స్థానికులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో అధికారులకు పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే క్యాంపస్ వేదికగా చాలా కుట్రలు జరిగినట్లుగా భావిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande