
విజయవాడ , 19 నవంబర్ (హి.స.)
: ఈరోజు తెల్లవారుజామున మరోసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. ఇందులో 6 నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. మిగిలిన వారు లొంగిపోవడం మంచిదని హితవు పలికారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నాం. నవంబరు 17న ఒక ఆపరేషన్ లాంచ్ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశాం. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది ఉన్నారు. ప్రజలకు ఎక్కడా హానీ జరగకుండా ఈ అరెస్టులు చేశాం. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి’’ అని ఏడీజీ తెలిపారు.
ఈరోజు తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి జ మరో 6 నుంచి ఐడుగురు చనిపోయినట్లు సమాచారం వచ్చింది. మిగిలిన వారు లొంగిపోవడం మందచిది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ