.మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌.. నోయిడాలోని ఇస్తాంబుల్‌ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 19 నవంబర్ (హి
.మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌.. నోయిడాలోని ఇస్తాంబుల్‌ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 19 నవంబర్ (హి.స.)

దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డా.ఉమర్‌ నబీ, ఫరీదాబాద్‌ ఉగ్ర నెట్‌వర్క్‌కు చెందిన డా.ముజమ్మిల్‌ గనాయీ తదితరులు 2021లో తుర్కియేకు వెళ్లారని.. ఆ దేశంలో వారు జైషే మహమ్మద్‌ ప్రతినిధులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా తుర్కియేతో సంబంధాలు ఉన్న సంస్థలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు గ్రేటర్‌ నోయిడాలోని ఇస్తాంబుల్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్‌పైనా దాడులు చేశారు.

ఇస్తాంబుల్‌ ఇంటర్నేషనల్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురిస్తున్నట్లు గుర్తించామని ఏటీఎస్‌ అధికారులు పేర్కొన్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2021లో డా.ముజమ్మిల్ గనాయీ, ఉమర్‌ తుర్కియే వెళ్లిన సమయంలో ఉమర్‌ ఓ విదేశీ హ్యాండ్లర్‌ను కలిశాడని.. ఈ హ్యాండ్లర్ భారత్‌లో టెర్రర్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేయడం, నిర్వహించడంపై వివరణాత్మక సూచనలు చేశాడన్నారు. పేలుడు పదార్థాలు, ఇతర వనరులను సేకరించడానికి తుర్కియే ఆధారిత నెట్‌వర్క్‌ల ద్వారా వారికి ఆర్థికసాయం అందిందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande