ఏపి రైతులకు డబుల్ ధమాకా
అమరావతి, 19 నవంబర్ (హి.స.):ఏపీ రైతులకు ఇదో డబుల్‌ ధమాకా! ‘పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్‌ 21వ విడత సొమ్ము రూ.2వేల చొప్పున కేంద్రం, అన్నదాత సుఖీభవ రెండో విడత సొమ్ము రూ.5వేల చొప్పున ర
ఏపి రైతులకు డబుల్ ధమాకా


అమరావతి, 19 నవంబర్ (హి.స.):ఏపీ రైతులకు ఇదో డబుల్‌ ధమాకా! ‘పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ పథకం డబ్బులు బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్‌ 21వ విడత సొమ్ము రూ.2వేల చొప్పున కేంద్రం, అన్నదాత సుఖీభవ రెండో విడత సొమ్ము రూ.5వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. దీంతో ఒకే రోజు ఒక్కో రైతు కుటుంబానికి రూ.7వేల చొప్పున లబ్ధి చేకూరనున్నది. పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి.

ప్రస్తుత రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92కోట్లు, కేంద్రం వాటా రూ.972.09 కోట్లు ఉంటుంది. బుధవారం కోయంబత్తూరులో పీఎం కిసాన్‌ నిధుల్ని ప్రదాని మోదీ విడుదల చేయనున్న నేపథ్యంలో అదే సమయంలో అన్నదాత సుఖీభవ సొమ్మును వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 10వేలపైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande