
పుట్టపర్తి 19 నవంబర్ (హి.స.)
:సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తులనడుమ సత్యసాయి నారాయణ రథోత్సవం జరిగింది. సాయికుల్వంతు మందిరంలో సత్యసాయి స్వర్ణ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ విగ్రహాన్ని, వేణుగోపాలస్వామి, సీతారాముల ఉత్సవ మూర్తులను గోపురం వద్దకు తోడ్కొని వచ్చి వెండి రథంపై కొలువుదీర్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ