
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 19 నవంబర్ (హి.స.): సమాచార భద్రత కోసం ఎటువంటి వివరాల్లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్‌తోనే కొత్త ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) యోచిస్తోంది. తద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచే అవకాశాన్ని నివారించడంతోపాటు ఆఫ్‌లైన్ పద్ధతిలో ఆధార్ కార్డును పరిశీలించే పద్ధతికి స్వస్తి పలకవచ్చని సంస్థ భావిస్తోంది. ఆధార్ కొత్త యాప్‌పై జరిగిన బహిరంగ ఆన్‌లైన్ సమావేశంలో యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ ఈ విషయం వెల్లడించారు. హోటళ్లు, ఈవెంట్లు తదితరచోట్ల ఆధార్ కాపీని తీసుకునే విధానాన్ని నివారించేందుకు ఈ కొత్త నియమాన్ని వచ్చే నెల నుంచి అమలులోకి తేవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం వయసును మాత్రమే తెలియజేసి ఇతర ప్రైవేటు సమాచారాన్ని దాచేలా ఈ నిబంధనను రూపొందించబోతున్నారు. ‘కార్డుపై పౌరుడి పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని యోచిస్తున్నాం. ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటే చాలు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఆధార్ నంబరును సేకరించడం, కాపీలను నిల్వ ఉంచుకోవడం నిషిద్ధమని ఆధార్ చట్టం చెబుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ