
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
పథనంథిట్ట/చెన్నై , , 19 నవంబర్ (హి.స.): మండల-మకరవిలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో(సోమవారం, మంగళవారం)నే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది. దర్శనం క్యూలైన్లో కుప్పకూలిపోయి ఓ మహిళ(58) మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జనసమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదని టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్ తెలిపారు.
బహుశా ఆలయ చరిత్రలోనే ఇదే అత్యధిక రద్దీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ‘‘కొంతమంది క్యూలైన్లను తప్పించుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీలక్కల్, ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించాం. నీలక్కల్‌లో ఏడు అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తాం. శబరిమల ప్రవేశాన్ని రోజుకు లక్ష మందికి, స్పాట్ బుకింగ్‌లను రోజుకు 20 వేల మందికి పరిమితం చేస్తాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ