
పుట్టపర్తి, 19 నవంబర్ (హి.స.)సత్యసాయి గొప్పదనం గురించి మన భారతీయులకంటే విదేశీయులకే ఎక్కువ తెలుసని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చైనీయులు ఆయన చిత్రపటాన్ని, విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఆరాధించేవారని చెప్పారు. గతంలో ఓ ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ సత్యసాయి దర్శనం కావాలని తన సోదరుడు చిరంజీవికి కాల్ చేశాడని, అది విని ఆశ్యర్యపోయానని చెప్పారు. ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు గురించి విదేశాలకు ఎలా తెలిసిందని అనుకునేవాడినని అన్నారు.
కరువు ప్రాంతమైన అనంతపురంలో పుట్టిన సాయిబాబా సురక్షిత మంచినీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం చేపట్టిన జల్ జీవన్ మిషన్ కు అంకురార్పణ చేసింది భగవాన్ సత్యసాయి బాబానే అని చెప్పారు. అనంతపురం లాంటి వెనకబడిన జిల్లానే సత్యసాయి తాను పుట్టడానికి ఎంచుకున్నారని కొనియాడారు. ఆయన జన్మించడం ద్వారా జిల్లాకు విదేశీయులు సైతం వచ్చారని అన్నారు. సత్యసాయి ద్వారా ఎంతోమంది ప్రభావితం అయ్యారని అన్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సైతం తనకు సెలవు ఉన్నప్పుడు పుట్టపర్తికి వచ్చి సేవ చేస్తారని చెప్పారు. సచిన్ లాంటి వ్యక్తి సత్యసాయి బాబా భోదనలకు ప్రభావితం అయ్యారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV