పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ
పుట్టపర్తి, 19 నవంబర్ (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చారు.ప్రధాని మోదీ.. పు
పుట్టపర్తి


పుట్టపర్తి, 19 నవంబర్ (హి.స.)శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి.

ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చారు.ప్రధాని మోదీ.. పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రధాని సత్యసాయి బాబా మహాసమాధికి చేరుకుని అక్కడ సత్యసాయిబాబాకు నివాళులర్పించారు. ఆ తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శతజయంతి కార్యక్రమంలో పాల్గొని బాబా స్మారకార్థం ప్రత్యేక నాణెం, స్టాంప్ విడుదల చేసారు త్వరలోనే ఈ నాణేలు ఆన్‌లైన్‌ బుకింగ్ ద్వారా విక్రయిస్తారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా జీవితం, బోధలను స్మరిస్తూ మోదీ ప్రసంగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande