
అనంతపురం, 19 నవంబర్ (హి.స.)అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సహా ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేయడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వారిపై దమనకాండ కొనసాగించడం దారుణమని ఆయన బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ, ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా హతమార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV