శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ సేవలు అనిర్వచనీయమైనవి : ప్రధానమంత్రి
పుట్టపర్తి, 19 నవంబర్ (హి.స.)శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ప్రధానమంత్రి మాట్లాడుతూ రాయ
మోది


పుట్టపర్తి, 19 నవంబర్ (హి.స.)శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ప్రధానమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొన్నప్పుడు సమస్యను పరిష్కరించడానికి సుమారు 3వేల కిలోమీటర్ల మంచినీటి పైపులైన్లను సత్యసాయిబాబా ఆధ్వర్యంలో వేయించారని గుర్తు చేశారు.

ఒడిస్సాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో అందిస్తున్నారన్నారు. సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలలో ఉచిత వైద్యం అందిస్తారన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను బోధిస్తూ వారిని విద్యావంతులను చేస్తున్నారన్నారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయడం గొప్ప విషయం అన్నారు. సత్యసాయిబాబా ట్రస్ట్ చేస్తున్న సేవలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande