
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 19 నవంబర్ (హి.స.)దిల్లీ పేలుడు (Delhi Blast) ఘటన నేపథ్యంలో ప్రముఖంగా వినిపిస్తున్న అల్-ఫలా యూనివర్సిటీ (Al Falah University)పై మంగళవారం ఈడీ (ED) అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూనివర్సిటీ తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం రూ.415.10 కోట్లు వసూలుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు గుర్తించామన్నారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తూ.. ఫీజులు వసూలుచేస్తున్నట్లు ఆరోపించారు.
విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలో దాడుల అనంతరం మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు విశ్వవిద్యాలయం ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. 2014-15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు ఉన్న విశ్వవిద్యాలయ ఆదాయ పన్ను రిటర్నులలో ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా సంపాదిస్తున్న ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ