
ఢిల్లీ, 20 నవంబర్ (హి.స.)రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్, రాష్ట్రపతి గవర్నర్‍లకు గడువు విధించలేమని తెలిపింది. బిల్లుల ఆమోదానికి గవర్నర్‍కు కాలపరిమితి లేదని అదే సమయంలో గవర్నర్లు అపరిమిత అధికారను వినియోగించలేరని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్)పై సీజేఐ జస్టిస్ బి.యార్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా గవర్నర్‍కు మాత్రం తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసింది. బిల్లుల విషయంలో గవర్నర్‍కు మూడు ఎంపికలు మాత్రమే ఉన్నాయని బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని ఇవి కాకుండా గవర్నర్‍కు నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్ రవి ఆమోదిచకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి మూడు నెల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేదంటే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని గత సెప్టెంబర్‍లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాజ్యాంగ అధికరణం 143(1) ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టుకు సంధించింది. రాష్ట్రపతి అభ్యర్థన మేరకు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది
---------------
.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV