10వ సారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
పాట్నా, 20 నవంబర్ (హి.స.)ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (NDA alliance) ఏకంగా 202 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికి ముందుగా ప్రకటించిన విధంగా సీఎం
nitish-kumar


పాట్నా, 20 నవంబర్ (హి.స.)ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (NDA alliance) ఏకంగా 202 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికి ముందుగా ప్రకటించిన విధంగా సీఎంగా నితీష్ కుమార్ ను ఎన్డీయే కూటమి ఏకగ్రీవంగా ఎంచుకుంది. అనంతరం ఈ రోజు బీహార్‌లో చరిత్ర సృష్టిస్తూ నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే పక్ష ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జేడీయూ–బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో సీఎంతో పాటు సమ్రాట్ చౌధరీ, విజయ్ కుమార్ సిన్హాలు మళ్లీ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు. నితీష్ నాయకత్వంలోని ఈ కొత్త ప్రభుత్వం బీహార్‌లో అభివృద్ధి, పరిపాలన పారదర్శకతను మరింత బలోపేతం చేయబోతుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాణ స్వీకారంతో బీహార్ రాజకీయాల్లో నితీష్ మరోసారి తన ప్రభావాన్ని స్పష్టంగా చాటుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande