అత్యాచారం కేసులో ముగ్గురికి రిమాండ్..
ఆదిలాబాద్, 21 నవంబర్ (హి.స.) మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకెళితే ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 1
రేప్ కేసు


ఆదిలాబాద్, 21 నవంబర్ (హి.స.)

మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ చేసిన

కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకెళితే ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలికను మభ్య పెట్టి.. మహారాష్ట్ర కిన్వట్ తాలూకా పిప్పల్గాంకు చెందిన నిందితులు యోగేష్ జాదవ్(22), సూరజ్ జాదవ్(25), ఆదిలాబాద్ కు చెందిన జాదవ్ నవీన్(26) అనే ముగ్గురు వ్యక్తులు.. గత కొన్నాళ్లుగా బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డట్లు డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా ఆ బాలికను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుల పై గ్యాంగ్ రేప్, పోక్సో కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande