

హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)
ఈ వర్క్ షాప్ లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:
---------
దేశవ్యాప్తంగా మనమంతా భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలనే ఆలోచనతో ముందుకు సాగాలి.
ప్రభుత్వాలు—ప్రజలు ఇద్దరూ కూడా ఇదే దిశలో పనిచేయాలి. ఈ ఆలోచన నుంచే ‘ఆత్మనిర్భర్ అభియాన్’ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అమెరికాలో ఒక చట్టం ఉండేది — PL-480. ఆ చట్టం ద్వారా అప్పట్లో అమెరికా మన దేశానికి పిల్లల కోసం పాలు, పాల పొడి డబ్బాలు పంపించేది.
మనకు రష్యా నుంచి గోధుమలు వచ్చేవి, మందులు వచ్చేవి. అమెరికా–రష్యా వంటి దేశాలు మన దేశాన్ని ఒక బీద దేశంగా చూస్తూ సహాయం పంపేవి.
ఒకప్పుడు మన దేశం కూడా కొన్ని ఆఫ్రికా దేశాలకు సాయం పంపుతున్నట్లే—
అప్పట్లో మనం Third World Country, Under-developed Nation గా ఉండేవాళ్లం.
మన చరిత్ర చూసుకుంటే ఒక పాట గుర్తుకువస్తుంది.
“Jahaan daal-daal par sone ki chidiya karti hai basera, woh Bharat desh hai mera…”
అంటూ వచ్చిన ఆ పాటలో భారతదేశాన్ని ‘సోనేకి చిడియా’ అని పోల్చారు.
అలాంటి సోనేకి చిడియా అయిన భారత్ — శతాబ్దాల దండయాత్రలతో ముక్కలు ముక్కలుగా చేయబడింది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ విభజింపబడిన దేశాన్ని ఒక దారంలా కట్టిన ఘనత సర్దార్ వల్లభభాయి పటేల్ గారిది.
ఆ రోజునుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు మన దేశాన్ని పాలించింది.
కానీ ఆ 55 సంవత్సరాల్లో కూడా భారత్ ఎప్పుడూ స్వతహాగా నిలబడలేదు.
ఎప్పుడూ ఏదో ఒక దేశం సహకారంతోనే ముందుకు వెళ్లాల్సి వచ్చేది.
కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఈ దేశం మన కాళ్ల మీద నిలబడాలి, ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశం కావాలి, ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్ గా ఎదగాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందుకే ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. Fourth largest economy in the world. ఈ ఆర్థిక విధానమే మనకు బలాన్ని ఇచ్చింది.
మన దేశంలో తయారయ్యే వస్తువులను మనమే వాడాలి. స్వదేశీని ప్రోత్సహించాలి.
కారణం ఏమిటంటే — మనకు అవసరమైన వస్తువులను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లక్షలాది, కోట్లాది రూపాయలు బయటకు వెళ్లిపోతాయి.
అదే మనమే ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తే — ఆ సంపద దేశంలోనే ఉంటుంది.
ఈరోజు మన దేశంలో తయారైన వస్తువులను మనం వాడాలి. విదేశీ వస్తువుల ‘మోజు’ లో పడకూడదు.
అమెరికా, చైనా వంటి దేశాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తమ వెనుకేసుకుని నడిపిస్తున్నాయి — అది మనం గుర్తించాలి.
భారతదేశం అలా కాదు… ఆత్మనిర్భర్ భారత్ కావాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం పూర్తిగా మారింది.
గతంలో మన దేశం భిక్ష పెట్టుకుని విదేశాలకి వెళ్లేదని చెప్పేవారు. మన దేశంలో పౌష్టికాహారం లేక పిల్లలు చనిపోతున్నారు, కరువులు వస్తున్నాయి అనే ఘటనలు, మాటలు వింటుండేవాళ్లం. అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు భారతదేశం అలాంటిది కాదు.
ఇప్పుడు మన ఫారెన్ ఎక్స్చేంజ్ భారీగా పెరిగింది. పెద్ద దేశాల దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా ఈరోజే మనం 56 దేశాలకు మన నిధులు అప్పుగా ఇస్తున్నాం. ఈ విషయం మనం గుర్తించాలి.
కరోనా ఆపత్కాలంలో కూడా భారతదేశం ఎవరి మీద ఆధారపడలేదు. ప్రపంచంలో మొదటి COVID వ్యాక్సిన్‌ను తయారు చేసిన దేశం భారత్.
మన దేశంలోని 140 కోట్ల జనాభాకే కాదు, అనేక దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపింది. అది భారతదేశం శక్తి.
గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆయుధాలు కొనేవాళ్ళం.
కానీ ఇప్పుడు బ్రహ్మోస్ , తేజస్ .. ఇలా మన దేశంలోనే తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం.
‘ఆపరేషన్ సింధూ’లో మన దేశంలోనే తయారు చేసిన ఆయుధాలు, విమానాలు అద్భుతంగా పనిచేశాయి. భారతదేశం ఇంత పెద్ద ఎత్తున స్వదేశీ రక్షణ సామగ్రి తయారు చేస్తుందనే విషయం తెలుసుకుని ప్రపంచం ఆశ్చర్యపోయింది.
ఇండస్ట్రీలలో, ప్రొడక్షన్ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియా కారణంగా గొప్ప మార్పు వచ్చింది.
Farm to Fiber, Fiber to Fabric, Fabric to Fashion, Fashion to Foreign.
అంటే మనం ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం. ఇంకా బయట వాళ్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
మన ఆలోచన స్వదేశీ ఉండాలి. మన వాడకంలో కూడా వస్తువులు స్వదేశీ ఉండాలి.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకుందో దేశానికి తెలిసిందే.
అక్కడ అభివృద్ధి జరగలేదు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగింది, మన ఎక్స్పోర్ట్ రేట్స్ కూడా పెరిగాయి.
ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు భారతీయ వస్తువులను తీసుకుంటున్నాయి. భారతదేశంలో తయారు చేసిన వస్తువుల ఎగుమతులు అన్ని రంగాల్లో పెరుగుతున్నాయి.
డిఫెన్స్, సైన్స్, R&D, ఫార్మసీ—ఏ రంగంలోనూ మనం ఇకపై ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
75 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానం చేరుకుంది. మన లక్ష్యం ఇప్పుడు మొదటి స్థానం. విశ్వ గురువు భారత్ గా నిలవాలి — ఆ దిశగా మనం ప్రయాణిస్తున్నాం.
మన దగ్గర ఎంతోమంది చేనేత కళాకారులు, చేతి వృత్తుల వారు, నేటివ్ స్కిల్స్ ఉన్న కార్మికులు ఉన్నారు. మన గ్రామాల్లో అనేక వస్తువులు తయారవుతున్నాయి. అవన్నీ మనం కొనాలి, ప్రోత్సహించాలి. మన దినచర్యలో వాడే వస్తువులు కూడా స్వదేశీ ఉండాలి.
దురదృష్టవశాత్తు, ఈ మధ్య ఒక కొత్త కలుషిత ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యాంటీ-ఇండియా స్లోగన్స్ ఇచ్చే వాళ్లకు అవార్డు ఇచ్చింది. కానీ మన ఆలోచన ఎల్లప్పుడూ ప్రో-ఇండియా ఉండాలి.
మన మనసు ప్రో-ఇండియా. మన చర్యలు ప్రో-ఇండియా. మనం వాడే వస్తువులు కూడా ఇండియన్ కావాలి. స్వదేశీ వస్తువులు వాడితేనే రేపు ఈ దేశాన్ని బలమైన దేశంగా మార్చగలుగుతాం.
మనమందరం ఒకే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి — 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా నిలవాలి.
‘వికసిత భారత్’ లక్ష్యం తో పనిచేస్తూ భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ అయ్యేలా ముందుకెళ్లాలి. ఆ దిశలో మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వేగంగా ముందుకు సాగుతున్నాం.
ఈ కార్యక్రమంలో చెప్పిన ప్రతి అంశాన్ని మీరు జిల్లా స్థాయి, మండల స్థాయిలకు తీసుకెళ్లాలి.
స్వదేశీ అభియాన్‌ను, స్వదేశీ మూవ్‌మెంట్‌ను గ్రామాల దాకా విస్తరించాలి.
ప్రజల్లో స్వదేశీ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడం — ఇదే మీ గొప్ప బాధ్యత, గొప్ప సేవ.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు