ఏలూరు జిల్లా.జంగా రెడ్డి గూడెం లో తరగతి గదిలోనే విద్యార్దిని.ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం, 21 నవంబర్ (హి.స.) ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో తరగతి గదిలోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి కావ్య (15).. జ
ఏలూరు జిల్లా.జంగా రెడ్డి గూడెం లో తరగతి గదిలోనే విద్యార్దిని.ఆత్మహత్య


జంగారెడ్డిగూడెం, 21 నవంబర్ (హి.స.)

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో తరగతి గదిలోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి కావ్య (15).. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలలో భోజన విరామ సమయంలో విద్యార్థులందరూ భోజనం చేసేందుకు వెళ్లగా.. ప్లేట్‌ తెచ్చుకునేందుకు కావ్య తిరిగి తరగతి గది వద్దకు వెళ్లింది. భోజనం చేసేందుకు కావ్య ఎంతకీ రాకపోవడంతో.. తీసుకొచ్చేందుకు తోటి విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో కావ్య.. తరగతి గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని ఉండడాన్ని గమనించి కేకలు వేశారు.

వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థిని మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు. ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, ఎస్సై వీరప్రసాద్‌ పరిశీలించారు. తోటి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కావ్య తండ్రి గంగాధర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి ఉష డయాలసిస్ పేషెంట్ కావడంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande