
అమరావతి, 21 నవంబర్ (హి.స.)
ఏపీలో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ