
విజయవాడ, 21 నవంబర్ (హి.స.)ఏపీ నకిలీ మద్యం కేసులోని (AP Fake liquor Scam) నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండును పొడిగించింది. మద్యంకేసు నిందితుల రిమాండ్ గడువు నేడు ముగియనున్న నేపథ్యంలో నిందితులను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. వారిని విచారించేందుకు కస్టడీని కొనసాగించాలని సిట్ అధికారులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల పిటిషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు నిందితుల రిమాండును డిసెంబర్ 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
లిక్కర్ స్కామ్ కేసుతో తనకు సంబంధం లేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కేసు కారణంగా తన కుటుంబం చిన్నాభిన్నామైందన్నారు. వందల ఏళ్లుగా సంక్రమించిన ఆస్తులను లిక్కర్ స్కాంలో అటాచ్మెంటులోకి తేవడం ధర్మం కాదన్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తులను లిక్కర్ తో సంపాదించానంటున్నారని పేర్కొన్నారు. తనను ఎన్ని రోజులు జైల్లో పెట్టినా భయం లేదన్నారు.
అయితే ఇటీవలే నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అటాచ్ చేయడానికి ఆమోదం తెలిపింది. కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV