
అనంతపురం, 21 నవంబర్ (హి.స.)
వైఎస్సార్సీపీ కీలక నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన సాకె శైలజానాథ్ (Shailajanath)కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సాకె గంగమ్మ (Gangamma) ఈ రోజు ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అనంతపురంలోని కుమారుడు శైలజానాథ్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయితే, సాకె గంగమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddyతో పాటు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, విడదల రజిని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV