రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలు : సీఎం
అమరావతి, 21 నవంబర్ (హి.స.) ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు (Sanjeevani Project) అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని సచి
చంద్రబాబు


అమరావతి, 21 నవంబర్ (హి.స.)

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు (Sanjeevani Project) అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని సచివాలయంలో శుక్రవారం నిర్వహించారు. సమీక్షలో భాగంగా కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సిటీ హెల్త్ స్కీం గురించి చర్చించారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో పథకం అమలు కానున్న నేపథ్యంలో.. అక్కడ విజయవంతమైన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందులల్లో మెడికల్ కాలేజీలను తొలి విడతలో నిర్మించనున్నారు. పీపీపీ ప్రాతిపదికన చేపట్టనున్న ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడారు. విద్యార్థులు, ప్రజలు, సామాజిక ప్రయోజనాలను ఆశించి మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోందన్నారు. పీపీపీ విధానంలోనే బోధనాసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande