బ్రిటన్‌కు స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ గుడ్‌బై..?
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 24 నవంబర్ (హి.
బ్రిటన్‌కు స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ గుడ్‌బై..?


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 24 నవంబర్ (హి.స.)

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీమిత్తల్‌ (Lakshmi Mittal) బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఆ దేశాన్ని వీడాలని మిత్తల్‌ నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. కీర్ స్టార్మర్ ప్రభుత్వ పన్ను విధానం రుచించక ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.

నాన్‌-డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని బ్రిటన్ (Britain) ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పన్ను విధానం కింద యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 226 సంవత్సరాల నుంచి ఈ పన్ను వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పన్ను మార్పులను అమల్లోకి తెచ్చే దిశగా బ్రిటన్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇవన్నీ అక్కడ నివాసం ఉంటున్న సంపన్నులను ఆలోచనలో పడేసింది. వారు యూకేను వీడి.. పన్ను మినహాయింపులకు స్వర్గధామంగా ఉండే ఇతర దేశాలపై దృష్టిసారించేలా చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande