.చండీగఢ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 24 నవంబర్ (హి.
amit shah


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 24 నవంబర్ (హి.స.)చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావడంపై దేశంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. చండీగఢ్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సరళీకృతం చేయడాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

ఈ ప్రతిపాదన చండీగఢ్ ప్రస్తుత పరిపాలనా వ్యవస్థను మార్చదని అలాగే పంజాబ్, హర్యానాలతో చండీగఢ్‌కు ఉన్న సాంప్రదాయ సంబంధాలను ప్రభావితం చేయదని హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అందరితో సంప్రదించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కూడా ఈ ప్రకటనలో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande