3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Maoist


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 24 నవంబర్ (హి.స.)ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి. మార్చి నెల నాటికి మావో రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో మావోల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ కమిటీ ప్రభుత్వాలకు లేఖ రాసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు లేఖలు రాసింది. మూడు జోనల్‌కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ రాశాడు.

సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని.. ప్రభుత్వ పునరావాసం పథకంలో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే లొంగిపోవడానికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరాడు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని.. సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని.. సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసేంత వరకు తమకు సమయం ఇవ్వాలని కోరాడు.

మావోయిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు మార్చి 31, 2026 లోపు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపై ఎలాంటి వారోత్సవాలు జరుపుకోబోమని.. ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాడు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande