
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బెంగళూరు:24 నవంబర్ (హి.స.)
కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీ కోసం మొదలైన పోరు మరిన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది. మిగిలిన రెండున్నరేళ్ల నాయకత్వం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు పట్టుబట్టగా అధిష్ఠానం జోక్యం అనివార్యమైంది. శుక్రవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరుకున్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రితో, ఆదివారం పలువురు మంత్రులతో ఆయన చర్చించారు. చివరకు ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. తన నివాసం వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘మీకు చెప్పేందుకు నా వద్ద ఏ విషయమూ లేదు. మూడు రోజులుగా నా ఇంటి వద్ద పడిగాపులు పడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధ అనిపించింది. పార్టీలోనూ ఇలాంటి పరిణామాలు మంచివి కాదు. ఎలాంటి సమస్యలున్నా అధిష్ఠానం పరిష్కరిస్తుంది’ అని చెప్పారు. బెంగళూరులో మూడు రోజులున్నా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్,
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ