
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 24 నవంబర్ (హి.స.)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు, దిల్లీ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో దిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ‘ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్’ (Operation Crystal Fortress) పేరుతో చేపట్టిన తనిఖీల్లో న్యూదిల్లీ ఛత్రపుర్‌లోని ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన 329 కిలోల మెథాంఫెటమైన్ (methamphetamine)ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. దిల్లీ సరిహద్దుల్లో విస్తరిస్తున్న అధునాతన మాదకద్రవ్యాల సిండికేట్‌ను నిర్మూలించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ