
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై,,24, నవంబర్ (హి.స.)అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు మన మార్కెట్‌నూ ప్రభావితం చేయొచ్చని అంటున్నారు. నిఫ్టీ-50 లాభాలు కొనసాగొచ్చని కొంత మంది సాంకేతిక విశ్లేషకులు అంచనా వేస్తుండగా, ఒకవేళ కిందకు దిగితే 25,920- 25,900 వద్ద మద్దతు లభించొచ్చని మరికొందరు అంటున్నారు. 26,166 పాయింట్ల పైన కొనసాగితే మరింత ముందుకు వెళ్లడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
లోహ కంపెనీల షేర్లు ప్రతికూల ధోరణిలో కదలాడవచ్చు. లోహ సూచీకి 10,000 వద్ద మద్దతు, 10,400 వద్ద తక్షణ నిరోధం కనిపిస్తోంది.
టెలికాం షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌పై సెంటిమెంటు సానుకూలంగా ఉంది. వొడాఫోన్ ఐడియా స్వల్ప కాలంలో ఒత్తిడికి గురి కావొచ్చు. త్వరలోనే ప్రభుత్వం ఏజీఆర్ బకాయిలపై ఉపశమన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇది సానుకూలత తీసుకురావొచ్చు.
ఫార్మా కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి ప్రతికూలంగా చలించొచ్చు. సూచీ జులై తర్వాత అత్యధిక స్థాయికి చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఇందుకు కారణం.
చమురు-గ్యాస్ కంపెనీల షేర్లు స్వల్పకాలంలో మిశ్రమ ధోరణిని ప్రదర్శించవచ్చు. ఈ రంగ సూచీ తక్షణ నిరోధం 12,300 వద్ద ఉంది. 12,501 స్థాయి పైకి వెళితే కనక తాజా సానుకూలతలు చూడొచ్చు. మద్దతు 12,000 వద్ద కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ