
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 25నవంబర్ (హి.స.)దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు గుర్తించిన తర్వాత DGCA ఈ అత్యవసర సలహాను జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు అనేవి ఈ ప్రాంతంలో నడుస్తున్న విమానాలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది.
ప్రమాదకరమైన అగ్నిపర్వత పరిస్థితుల గురించి పైలట్లను హెచ్చరించడానికి DGCA సోమవారం సాయంత్రం NOTAM లాంటి ప్రకటన అయిన ప్రత్యేక విమానయాన హెచ్చరిక ASHTAM జారీ చేసింది. దానితో పాటు, అగ్నిపర్వత బూడిద సలహా కూడా జారీ చేసింది. అన్ని భారతీయ విమానయాన ఆపరేటర్లను ఆపరేషన్స్ మాన్యువల్ –వోల్కనిక్ యాష్ గురించి సిబ్బందికి వివరించాలని ఈ ప్రకటనలో కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ