
ముంబయి, 26 నవంబర్ (హి.స.): దేశీయ స్టాక్‌మార్కెట్‌లో (Stock market) చాలా రోజుల తర్వాత మంచి ర్యాలీ కనిపించింది. వరుసగా మూడు రోజుల నష్టాల అనంతరం నేడు దూసుకెళ్లిన సూచీలు.. భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణం. సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 26,200 మార్కును దాటింది. ఈ క్రమంలోనే సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠాలకు కాస్త దూరంలో నిలిచాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ (BSE market cap) ఒక్క సెషన్‌లో రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.475 లక్షల కోట్లకు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు