అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ మంత్రి నారా లోకేశ్‌ భేటీ
హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) భేటీ అయ్యారు. 2006-19 వరకు రామ్‌లాల్‌ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా(సంస్థ), ఆరెస్సెస్‌ల
Lokesh


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సంపర్క్ ప్రముఖ్ రామ్‌లాల్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) భేటీ అయ్యారు. 2006-19 వరకు రామ్‌లాల్‌ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా(సంస్థ), ఆరెస్సెస్‌లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. ఆరెస్సెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఉండవల్లి సీఎం నివాసంలో మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు.

దేశవ్యాప్తంగా ఆరెస్సెస్‌ చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను ఈ సందర్భంగా వివరించారు. రామ్ లాల్‌ను మంగళగిరి శాలువాతో మంత్రి లోకేశ్‌ ఘనంగా సత్కరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande