'SIR' ను నిలిపివేయలేం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, 26 నవంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా అమలు అవుతున్న ''SIR.'' ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు లో పిటిషనర్లకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంశంపై స్టే విధించడానికి సుప్
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 26 నవంబర్ (హి.స.)

దేశవ్యాప్తంగా అమలు అవుతున్న

'SIR.' ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు లో పిటిషనర్లకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంశంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 'S.I.R.' ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ దశలో దానిపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం (EC) ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం కోసం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande