
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై: ఢిల్లీ 25నవంబర్ (హి.స.)దేశంలో కీలక రెపోరేటు మరింతగా తగ్గించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హో త్రా అన్నారు. మరిన్ని రెపో కోతలకు పరిస్థితి సానుకూలంగా ఉన్న విషయం అక్టోబరు ఎంపీసీ సమావేశ సమయంలోనే ప్రకటించిన విషయం ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేశా రు. ఆ పరిస్థితి ఏమీ మారలేదన్న విషయం ఆ తర్వాత వచ్చిన గణాంకాలు నిరూపించాయని ఆయన అన్నారు. అయితే డిసెంబరు మొదటి వారంలో జరుగబోయే ఎంపీసీ ఆ విషయం పరిగణనలోకి తీసుకుంటుందా, లేదా అనేది కమిటీయే నిర్ణయిస్తుందని చెప్పారు. 2024 సంవత్సరం ప్రథమార్ధంలో ఒక శాతం మేరకు రెపోరేటును తగ్గించిన ఎంపీసీ అక్టోబరులో మాత్రం విరామం ఇచ్చింది. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతానికి దిగి రావడం మరో విడత రెపోరేటుకు సానుకూల అంశమని విశ్లేషకులంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ