
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 25నవంబర్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ‘ముస్లిం బ్రదర్‌హుడ్’ సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ముద్ర వేసేందుకు చర్యలు చేపట్టారు. ట్రంప్ చర్యలతో అరబ్ ప్రపంచంలోని పురాతన, అత్యంత ప్రభావవంతమైన ఉద్యమం ఆంక్షల పరిధిలోకి రానుంది.
వైట్‌హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. లెబనాన్, ఈజిప్టు, జోర్డాన్ వంటి ముస్లిం బ్రదర్‌హుడ్ (Muslim Brotherhood) సంస్థలపై చర్యలు తీసుకునేవిధంగా నివేదిక సమర్పించాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇప్పటికే అధ్యక్షుడు సంతకాలు చేశారు. నివేదిక అందిన 45 రోజుల్లోపు ఆ సంస్థలపై ఎలాంటి ముద్ర వేయాలో అనే అంశంపై మంత్రులు ముందుకువెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ దేశాలలోని ముస్లిం బ్రదర్‌హుడ్ అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్, యూఎస్ భాగస్వాములపై హింసాత్మక దాడులకు మద్దతివ్వడం, ప్రోత్సహించడం వంటివి చేస్తున్నాయని ట్రంప్ పరిపాలన ఆరోపించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ