రాజకీయ పార్టీల అజ్ఞాత విరాళాలపై పిటిషన్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
రాజకీయ పార్టీల అజ్ఞాత విరాళాలపై పిటిషన్‌


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 25నవంబర్ (హి.స.)దేశంలో రాజకీయ పార్టీలకు రూ.2వేల లోపు విరాళాలను అందజేసే వ్యక్తుల పేర్లు, వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించిన ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనను సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించాలని కోరుతూ కేంద్రం, ఎన్నికల సంఘం(ఈసీ)తో పాటు భాజపా, కాంగ్రెస్‌ తదితర రాజకీయ పార్టీలకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నగదు రూపంలో విరాళాలను స్వీకరించరాదనే షరతును రాజకీయ పార్టీల పేరు నమోదు, ఎన్నికల గుర్తు కేటాయింపు సమయంలోనే విధించేలా ఈసీని ఆదేశించాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande