
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
పాట్నా: /ఢిల్లీ 25నవంబర్ (హి.స.)బిహార్‌లో పార్టీ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ కొరడా ఝలిపించింది. ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారంనాడు బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది. బీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కపిల్‌దేవ్ ప్రసాద్ యాదవ్ ఈ ఆదేశాలను జారీ చేశారు.
పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఈ నేతలు పార్టీ వెలుపల వేదికలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ పేర్కొంది. పార్టీ నిర్ణయాలను పదేపదే పత్రికల్లోనూ, సామాజికమాధ్యమాల్లోనూ విమర్శించడం, టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని తెలిపింది. పార్టీ పరిశీలకులు, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ సమీక్ష జరిపి, కేంద్ర పరిశీలకులు అవినాష్ పాండే సమ్మతితో పూర్తి పారదర్శకతంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ