
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 25నవంబర్ (హి.స.)
ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని అగ్ని పర్వతం హేలి గుబ్బి ఆదివారం బద్దలైన విషయం తెలిసిందే. దాదాపు 12 వేల ఏళ్ల తరువాత అగ్నిపర్వతం బద్దలు కావడంతో అక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించింది. అగ్ని పర్వత విస్ఫోటనం కారణంగా దట్టమైన పొగ, బూడిద 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి పడింది. భారత ఉపఖండం వైపు ప్రయాణించిన ఈ బూడిద మేఘాలు ఢిల్లీ గగనతలంలోకి ప్రవేశించాయి. వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న ఈ మేఘాలు తొలుత గుజరాత్‌లో ప్రవేశించి, అనంతరం రాజస్థాన్, ఢిల్లీ వైపు మళ్లాయి. (Volcanic Ash Clouds Reach Delhi).
ఈ విషయంలో డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలను హెచ్చరించింది. బూడిద మేఘాలతో సమస్య లేకుండా ఫ్లైట్‌ల మార్గాన్ని మార్చుకోవాలని సూచించింది. మార్గమధ్యంలో ఈ దుమ్మూధూళి మేఘాలు ఎదురైతే వెంటనే తమకు సమాచారం అందించాలని కూడా తెలిపింది. ఇంజన్ పనితీరులో మార్పులు, కేబిన్‌లో పొగలు, దుర్వాసన వంటివి తలెత్తిన వెంటనే తమను అప్రమత్తం చేయాలని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ