
కర్నూలు, 26 నవంబర్ (హి.స.)అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో ప్రభావవంతమైన ఔషధ మూలిక.. అల్లం వికారం, బరువు తగ్గడం, ఋతు నొప్పి, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో అల్లం ప్రయోజనాలేంటో తెలుసుకోండి..
శీతాకాలం ప్రారంభమైన నాటి నుంచి దగ్గు, జలుబు, గొంతు నొప్పి సర్వసాధారణం అవుతాయి. ఈ సమస్యలకు మందుల ద్వారా మాత్రమే పరిష్కారాలు వెతకాల్సిన అవసరం లేదు. భారతీయ వంటగదిలో తక్షణ ఉపశమనం కలిగించే అనేక మూలికలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన ఒక మూలిక అల్లం.. మసాలా దినుసైన అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వాస్తవానికి శీతాకాలంలో అల్లం ప్రాముఖ్యత పెరుగుతుంది.. ఎందుకంటే.. ఇది చాలా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అలాగే.. దగ్గు – జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.. అంతేకాకుండా మహిళలకు ఋతు నొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV