పార్లమెంట్‌లో అంబేద్కర్‌, రాజేంద్ర ప్రసాద్‌ సేవలను కొనియాడిన స్పీకర్ ఓం బిర్లా
ఢిల్లీ, 26 నవంబర్ (హి.స.) : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలోని ''సంవిధాన్ సదన్''లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన,
speaker-om-birla-praises-ambedkars-services-in-parliament-497864


ఢిల్లీ, 26 నవంబర్ (హి.స.) : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలోని 'సంవిధాన్ సదన్'లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day of India) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్‌, రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (B.R. Ambedkar) సేవలను ఆయన గౌరవపూర్వకంగా స్మరించుకున్నారు. అంబేద్కర్ అసాధారణ జ్ఞానం, దార్శనికత, నిరంతర కృషి ఫలితంగానే దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, గౌరవం, ఆత్మగౌరవాన్ని హామీ ఇచ్చే గొప్ప రాజ్యాంగం లభించిందని ఓం బిర్లా కొనియాడారు.

కాగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రకటన మరోసారి నొక్కి చెప్పింది. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మహనీయుల ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ గుర్తు చేసుకోవాలని స్పీకర్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande