మాదాపూర్లో డ్రగ్స్ రవాణా.. ఇద్దరు యువకులు అరెస్ట్..
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.) మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి డ్రగ్స్ కేసు బయటపడింది. అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఎండీఎంఏ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సమయంలో అరెస్టైన వ్యక్తుల వద్ద
డ్రగ్స్


హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

మరోసారి డ్రగ్స్ కేసు బయటపడింది. అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఎండీఎంఏ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సమయంలో అరెస్టైన వ్యక్తుల వద్ద నుంచి 14 గ్రాముల ఎండీఎంఏ, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఈ ఇద్దరూ రెగ్యులర్గా డ్రగ్స్ వినియోగిస్తున్నారని, వీరిపై గతంలో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ను బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి తెచ్చారని విచారణలో బయటపడింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande