ఇండిగో సిబ్బందిని గౌరవించండి ప్లీజ్..! నటుడు సోనూసూద్ సంచలన ట్వీట్
ముంబై, 6 డిసెంబర్ (హి.స.) క్రూ షార్టేజ్, కొత్త డ్యూటీ రూల్స్ (FDTL), టెక్నాలజీ గ్లిచ్ ఇలా రకరకాల కారణాలతో దేశవ్యాప్తంగా 1,200కి పైగా ఫ్లైట్లు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ ఇండిగ
/please-respect-indigo-staff-actor-sonu-soods-sensational-tweet-501131


ముంబై, 6 డిసెంబర్ (హి.స.)

క్రూ షార్టేజ్, కొత్త డ్యూటీ రూల్స్ (FDTL), టెక్నాలజీ గ్లిచ్ ఇలా రకరకాల కారణాలతో దేశవ్యాప్తంగా 1,200కి పైగా ఫ్లైట్లు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ ఇండిగో సిబ్బందిపై చిందులు వేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దుర్భాషలాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న ఇండిగో సిబ్బందికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో ఒక ట్వీట్ చేశారు.

ఫ్లైట్ ఆలస్యమైతే నిరాశ కలుగుతుంది, కానీ దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్న ముఖాలను గుర్తుంచుకోవాలని సోనూసూద్ అన్నారు. దయచేసి ఇండిగో సిబ్బందితో మర్యాదగా, వినయంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాళ్లు కూడా ఫ్లైట్ రద్దుల భారాన్ని మోస్తున్నారని, మనందరం కలిసి వాళ్లకు మద్దతు ఇద్దామని సోనూ సూద్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ ప్రయాణికులు, ఇండిగో సిబ్బంది మధ్య సానుకూలతను పెంచేలా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

--------------

-

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande