బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?
బీట్‌రూట్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇది ఎంత ఆరోగ్యకరమో, దాని ఆకులు కూడా అంతే పోషక విలువలు కలిగి ఉంటాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Beetroot Leaves Benefits: Boost Immunity, Gut Health And Strong Bones


బెంగళూరు, 6 డిసెంబర్ (హి.స.)

బీట్‌రూట్ అంటే మనకు మనసుకు హత్తుకునే ఎరుపు రంగు దుంపే తొలుత గుర్తుకు వస్తుంది. కానీ ఆ దుంపకన్నా ఎంతో మంచి గుణాలున్న ఆకులు కూడా దీనికి ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ ఆకులు పోషకాల గని. వీటిని మనం రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.ఈ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేద వైద్యుడు డా. పుల్లారావు చిలకమూడి మాట్లాడుతూ బీట్‌రూట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉందని, ఇది కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీట్ రూట్ ఆకుల్లో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బీట్‌రూట్‌ ఆకుల్లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌ ఆకులు తింటే గట్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ సమస్యలు రావు.

బీట్‌రూట్‌ ఆకులు తింటే వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు.. బీట్‌రూట్‌ ఆకుల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్‌ అందిస్తుంది. ఫలితంగా తక్కువ తింటారు. దీంతో బరువు తగ్గొచ్చు. బీట్‌రూట్‌ ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి అధిక మోతాదులో లభిస్తుంది. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యవంతంగా మార్చుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్‌రూట్‌ ఆకులు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి: బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. బీట్‌రూట్ ఆకుల్లోని విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ఆకుల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను రక్షించేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు : బీట్‌రూట్ ఆకుల్లోని నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. ఈ ఆకులు గుండె సంబంధిత సమస్యలు నివారించేలా ఉపయోగపడుతాయి.

కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం: బీట్‌రూట్ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ, లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసుతో వచ్చే కంటి సమస్యలను ఈ ఆకులు నివారించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా కంటి శుక్లం వంటి సమస్యలను నివారించడంలో ఈ బీట్‌రూట్ ఆకులు ఉపయోగపడతాయి. కాబట్టి, కేవలం బీట్‌రూట్ మాత్రమే కాకుండా దాని ఆకులను కూడా మీ ఆహారంలో తీసుకోండి..

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande