పాకిస్థాన్ “ISI”కి రహస్య సమాచారం అందించిన న్యాయవాది!
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
పాకిస్థాన్ “ISI”కి రహస్య సమాచారం అందించిన న్యాయవాది!


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 27నవంబర్ (హి.స.)భారత్‌లో దేశ ద్రోహులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి రహస్య సమాచారం అందించాడనే ఆరోపణలపై హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని పోలీసులు ఒక న్యాయవాదిని అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ సంవత్సరం మేవాట్ ప్రాంతంలో అనుమానిత పాకిస్థానీ గూఢచారులను అరెస్టు చేయడం ఇది మూడవసారి. అరెస్టయిన న్యాయవాదిని నుహ్‌లోని ఖర్ఖారి గ్రామానికి చెందిన రిజ్వాన్‌గా గుర్తించారు. అతను గురుగ్రామ్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం విచారణ కోసం రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఆరోపణలు నిర్ధారణకు వచ్చాయి. దీందో తవాడు సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.

మరో న్యాయవాదిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. రిజ్వాన్ ISIకి సున్నితమైన, కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడని, పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నాడని సమాచారం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande