
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 27నవంబర్ (హి.స.) ‘ఎస్సీ విద్యార్థుల ఉన్నతశ్రేణి ఉపకారవేతనాల’కు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్థిక సాయాన్ని విస్తరించడం, విద్యాసంస్థల జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే దిశగా 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం పూర్తి ట్యూషన్ ఫీజు, విద్యాసంబంధ సామగ్రికి అవసరమైన మొత్తాన్ని డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేయనున్నారు. మొదటి సంవత్సరం రూ.86 వేలు ఇస్తారు. ఆ తర్వాత పుస్తకాలు, లాప్‌టాప్ వంటి అవసరాలకు ఏటా రూ.41 వేలు విద్యార్థి ఖాతాకు బదిలీ చేస్తారు.
ఈ ఉపకార వేతనాలు పొందేందుకు దళిత విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలి. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, జాతీయ న్యాయ విశ్వవిద్యాయాలు వంటి గుర్తింపుపొందిన 200 సంస్థల్లో చేరినవారు, కేంద్ర-రాష్ట్రాల నుంచి మరే ఇతర ఉపకారవేతనాలు పొందని విద్యార్థులు అర్హులని నిబంధనల్లో పొందుపర్చారు. - మొదటి సంవత్సర విద్యార్థులు మాత్రమే కొత్త దరఖాస్తు చేసుకునే వీలుంది. పనితీరు ఆధారంగా మిగతా సంవత్సరాల్లో అది రెన్యువల్ అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ